Share News

రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌: ఎస్పీ

ABN , Publish Date - May 13 , 2026 | 12:24 AM

రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తూ.. వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు.

రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌: ఎస్పీ

పలాస, మే 12(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తూ.. వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు. మంగళవారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల అమలును వేగవంతం చేయాలన్నారు. పోక్సో, మహిళలపై జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండడంతో పాటు వారికి న్యాయం చేకూరే విధంగా చర్యలు తీ సుకోవాలని స్ప ష్టం చేశారు. గంజాయి, దొం గతనాల కేసుల దర్యాప్తు వేగ వంతంగా పూ ర్తి చేయాలని, దొంగ తనానికి గు రైన ఆస్తులను రికవరీ చేయాలని ఆదే శించారు. కా శీబుగ్గ సబ్‌ డివి జన్‌లో నేర నియంత్రణకు పటి ష్ఠంగా కృషి చే యాలన్నారు. అ సాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని, డ్రోన్‌ సాయంతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పేకాట, గంజాయి, డంకన్‌డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెంచాలని ఎస్పీ ఆదేశించారు. విజబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచాలన్నారు. ప్రజాఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలు, మహిళల భద్రత, సంబంధిత చట్టాలపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్‌డివిజన్‌లో నమోదవుతున్న కేసులు, దర్యాప్తులో పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, ఛార్జ్‌షీట్ల దాఖలు వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం చేశారు. ఆయన వెంట కాశీబుగ్గ, టెక్కలి డీఎస్పీలు టి.భవాని, డి.లక్ష్మణరావు, సీఐలు వై.రామకృష్ణ, మంగపతిరావు పాల్గొన్నారు.

సబ్‌డివిజినల్‌ కార్యాలయంలో...

టెక్కలి, మే 12(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో గల పోలీస్‌ సబ్‌డివిజినల్‌ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వార్షిక తనిఖీ నిర్వహించారు. డీఎస్పీ లక్ష్మణరావుతో పాటు సీఐలు విజయ్‌కుమార్‌, శ్రీనివాసరావు, రాము తదితరులతో సమావేశమై ముఖ్యమైన అంశాలపై సమీక్షించారు. రికార్డుల పరిశీలన అనంతరం శాంతిభద్రతలు, నేర నియంత్రాణా చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.

Updated Date - May 13 , 2026 | 12:24 AM