Share News

ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోండి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:54 PM

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి సమస్య లపై తాము స్పందించి ఉచితంగా న్యాయసహా యం అందజేస్తామని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు.

  ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోండి
మాట్లాడుతున్న హరిబాబు:

పలాస, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి సమస్య లపై తాము స్పందించి ఉచితంగా న్యాయసహా యం అందజేస్తామని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. ఈ-శ్రమ్‌లో ప్రతి కార్మికుడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సోమవారం పలాసలోని జీడి కార్మికభవన్‌లో కార్మికులకు ఉచిత న్యాయం పై కార్మికసంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమల్లో ఇబ్బందులు తలెత్తితే సత్వర న్యాయం కోసం టోల్‌నెంబరు 15100కు సంప్రదించాలని కోరారు.కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి సాన ఈశ్వరరావు, కోశాధికారి రాము, గౌరవాధ్యక్షుడు బొంపల్లి సింహా చలం, ఎస్‌ఐ ఎస్‌.సునీల్‌, ఏఎల్‌వో విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:54 PM