Share News

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:46 PM

వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ అరవల రవీంద్రబాబు అన్నారు.

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మాట్లాడుతున్న వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ అరవల రవీంద్రబాబు

వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ రవీంద్రబాబు

నైర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ

శ్రీకాకుళం అర్బన్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ అరవల రవీంద్రబాబు అన్నారు. నైర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నైర గ్రామంలో ‘ఖేత్‌బచావో అభియాన్‌’ కార్య క్రమం, అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరు వుల వాడకం వల్ల భూసారం తగ్గుతుంద న్నారు. అందువల్ల రైతులు సేంద్రియ, జీవన ఎరువుల వాడకంపై అవగాహన పొంది వ్యవ సాయంలో అమలు చేయాలన్నారు. తప్పని సరిగా భూసారపరీక్షలు చేయించాలన్నారు. సర్పంచ్‌ అరవల ప్రతాప్‌, గ్రామ పెద్ద కర్రి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. పచ్చిరొట్ట, పశు వుల ఎరువుల వాడకం ద్వారా భూమి జీవశక్తిని కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యవ సాయ కళాశాల అధ్యాపకులు ఉపేంద్రరావు, గురుమూర్తి, చిన్నన్నాయుడు, జగన్నాథం, గోవిం దరావు, రవికుమార్‌, శశిధర్‌, మౌనిక, కళాశాల విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:46 PM