హెచ్‌ఐవీపై అవగాహనకు 26న రెడ్‌రన్
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:17 AM
హెచ్‌ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ఉదయం 5.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి 5కే రెడ్‌రన్ మారఽథాన్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.ఈవీ నరేష్‌కుమార్ తెలిపారు. శ
డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ఉదయం 5.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి 5కే రెడ్‌రన్ మారఽథాన్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.ఈవీ నరేష్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డా.టి.శ్రీకాంత్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. యువ సమ్మేళన్‌లో భాగంగా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీ చేపడుతున్నామన్నారు. 17 నుంచి 25 ఏళ్లులోపు వయసున్న కళాశాల విద్యార్థులు, రెడ్‌రిబ్బన్ క్లబ్ సభ్యులు ఈ పరుగులో పాల్గొ నేందుకు అర్హులన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు ఉం టాయన్నారు. విజేతలకు మొదటి రెండు బహుమతుల కింద రూ.10 వేలు, రూ.7 వేలు నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. గత ఏడాది విజేతలుగా నిలిచిన వారు ఈసారి పాల్గొనేందుకు వీల్లేదన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 94944 74206 నెంబర్‌కు ఫోన్ చేసి ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రిజిస్ర్టేషన్లను అంగీకరించేది లేదని స్పష్టంచేశారు.