రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:51 PM
రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తు న్న సేవలు అభినంద నీయమని సర్వశిక్షా అభియాన్ పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు.
ఎస్‌ఎస్‌ఏ పీడీ బి.శ్రీనివాసరావు
అరసవల్లి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తు న్న సేవలు అభినంద నీయమని సర్వశిక్షా అభియాన్ పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం నగరంలోని రెడ్‌క్రాస్ తలసేమియా సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తలసేమియా బాధితులకు అందిస్తున్న సేవలను తెలుసుకుని నిర్వాహకులను అభినం దించారు. ఉచితంగా రక్తం, మందులు, బాధితులతో పాటు వచ్చే సహా యకులకు భోజనం, రవాణా ఖర్చులు కూడా సంస్థ అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. దాతలు, కార్పొరేట్ సంస్థలు, ఈ చిన్నారుల మందుల ఖర్చులకు సహకరించాలని కోరారు. అనంతరం చిన్నారులకు పౌష్ఠికాహార కిట్లను అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా కార్యదర్శి బలివాడ మల్లే శ్వరరావు, సభ్యులు వైకుంఠరావు, ఎం.కల్యాణ చక్రవర్తి, జి.రమణ, వి.శ్రీ వర్థన్, బి.సతీష్, కె.అనూరాధ, బి.రాజేశ్వరి, ఎం.శ్యామలత, ఎం.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.