Share News

విశ్వసనీయత వల్లే రెడ్‌క్రాస్‌కు గుర్తింపు

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:52 PM

విశ్వసనీయత వల్లే రెడ్‌క్రాస్‌ సొసైటీకి నిజ మైన గుర్తింపు అని కలెక్టర్‌ సప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న సందర్భం గా బుధవారం స్థానిక రెడ్‌క్రాస్‌ భవనం లో అభినందన సభ నిర్వహించారు.

 విశ్వసనీయత వల్లే రెడ్‌క్రాస్‌కు గుర్తింపు
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అరసవల్లి, సెప్టెంబరు 2(ఆంధ్ర జ్యోతి): విశ్వసనీయత వల్లే రెడ్‌క్రాస్‌ సొసైటీకి నిజ మైన గుర్తింపు అని కలెక్టర్‌ సప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న సందర్భం గా బుధవారం స్థానిక రెడ్‌క్రాస్‌ భవనం లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కలెక్టర్లు అందించిన ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు నేతృత్వంలో చేపడుతున్న సేవలే ఈ ఘనతకు కారణ మన్నారు. జిల్లాలో 2500 యూనిట్ల రక్తం ప్రతి ఏటా అవసరమని, ప్రస్తుతం 50 శాతం కొరత ఉందన్నారు. రక్త దాన శిబిరాలు, చైతన్య కార్యక్రమాల ద్వారా ఈ లోటును పూడ్చి, తలసీమియా బాధిత చిన్నారులకు, నిరుపేద రోగులకు ప్రాణదానం చేయా లని కోరారు. రెడ్‌క్రాస్‌ ద్వారా వృద్ధులకు నిలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్‌ సేవలు, ఉచిత రక్తమార్పిడి వంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్య త్‌లోనూ కొనసాగించాలని కోరారు. సేవా విభాగాల్లో విశిష్ట పాత్ర పోషిస్తున్న ప్రతినిధులు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండ్యా, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కనుగుల సుధీర్‌, కోశాధికారి దుర్గా శ్రీనివాస్‌, వైద్యులు, వలంటీ ర్లను కలెక్టర్‌ సత్కరించారు. కార్యక్రమంలో జూనియర్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, వివిధ సంస్థల ప్రతినిధులు, రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:52 PM