కళలకు గుర్తింపు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:33 AM
District residents selected for Ugadi Award రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కా రాల్లో జిల్లాకు సంబంధించి వేర్వేరు కళారం గాల్లో ముగ్గురికి చోటు దక్కిం ది. నాటక రంగంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన పిరియా చలపతిరావు, హిరమండలం మండలానికి చెందిన అర్జంగి లింగమూర్తి, చెంచు నృత్య కళకు సంబంధించి నరసన్నపేట మండ లానికి చెందిన ఆవల జగన్నాథం ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
ఉగాది పురస్కారానికి జిల్లా వాసుల ఎంపిక
నాటక రంగంలో చలపతిరావు, లింగమూర్తి
చెంచు నృత్యంలో జగన్నాథుడికి అవార్డులు
కవిటి/ నరసన్నపేట/ హిరమండలం, మార్చి 17(ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కా రాల్లో జిల్లాకు సంబంధించి వేర్వేరు కళారం గాల్లో ముగ్గురికి చోటు దక్కిం ది. నాటక రంగంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన పిరియా చలపతిరావు, హిరమండలం మండలానికి చెందిన అర్జంగి లింగమూర్తి, చెంచు నృత్య కళకు సంబంధించి నరసన్నపేట మండ లానికి చెందిన ఆవల జగన్నాథం ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావును నాటక రంగం లో కళారత్న అవార్డును ప్రకటించారు. చలపతి రావుకు పాఠశాలలో చదువుకున్నప్పటి నుం చీ నాటక రంగంపై ఆసక్తి. పిసినారి నాటికతో రంగ ప్రవేశం చేశారు. తర్వాత బొరివంక కేంద్రంగా 1996లో శార్వాణి ఫైనార్ట్స్ సంస్థ ద్వారా తన ప్రస్థా నాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కళారంగం లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 1997లో రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో జాతిస్మరామి నాటకానికి ఉత్తమ సహాయనటుడిగా తొలి అవా ర్డును సొంతం చేసుకున్నారు. తర్వాత రాష్ట్ర, అంత ర్రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతూనే ఉన్నారు. 2008లో రేలా అనే నాటిక ద్వారా నంది నాటకో త్సవాల్లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2012, 2014-15లో నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటు డు, ఉత్తమ విలన్‌తోపాటు క్యారెక్టర్ అర్టిస్ట్‌గా పలు అవార్డులు సాధించారు. తాజాగా కళారత్న రాష్ట్రస్థాయి అవార్డుకు చలపతిరావు ఎంపిక కావ టంతో ఉద్దానం ప్రాంత కళాకారులు, అభిమానులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.
నరసన్నపేట మండలం శ్రీరాంపురం(గుండువిల్లిపేట) గ్రామానికి చెందిన ఆవల జగన్నాథా నికి చిన్నప్పటి నుంచి చెంచు నృత్యాలపై ఆసక్తి. తండ్రి బాటలో పయనిస్తూ.. గ్రామాల్లో చెంచు నృత్యాలు చేస్తూ.. చెంచుల సంస్కృతికి జీవం పోశారు. ఆరు దశాబ్దాలుగా యాస, భాషతోపాటు గ్రామాల్లో చెంచుల సంస్కృతి.. సంప్రదాయాలను ఇనుమడింపజేస్తున్నా రు. సంక్రాంతి, ఇతర పర్వదినాల్లో పట్టణాల్లో కూడా బృందంతో చెంచు నృత్యాలను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పుర స్కారానికి ఆయనను ఎంపిక చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలి పారు. అలాగే అవార్డుకు ఎంపికైన జగన్నాథానికి మంత్రి అచ్చెన్నా యుడు, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అభినందనలు తెలిపారు.
హిరమండలం మండలంలోని మహా లక్ష్మీపురం కాలనీకి చెందిన అర్జంగి లింగమూర్తి ప్రభుత్వ ఉగాది పురస్కా రానికి ఎంపికచేసింది. నాలుగు దశాబ్దాలుగా రంగస్థల నాటక రంగానికి విశేషసేవలు అందిస్తూ మూడు వేలుకుపైగా ప్రదర్శనలిచ్చారు. ఆయన తల్లిదండ్రులు అర్జంగి దాలమ్మ, వీరస్వామి. ఆయన చిన్నతనం నుంచి పద్యా నాటక రంగంపై ఆసక్తి కనబరిచేవారు. 1985లో పద్య నాటకరంగం లోకి ప్రవేశాంచారు. 1986లో సత్యహరిశ్యంద్రుడిగా కాటిసీనులో నటించి గుర్తింపు పొందారు.అప్పటి నుంచి 3000లకు పైగా పద్య నాటక ప్రదర్శన లిచ్చారు.నాటకరంగాన్నే వృత్తిగా చేసుకొని కుటుంబ పోషన చేస్తున్నారు. కురుక్షత్రం, రామాంజనేయయుద్ధం, సత్యహరిశ్చంద్ర, గయోపాక్షణం నాట కాలలో ధర్మరాజు, యయాతి, సత్యహరిశ్చంద్ర, గయుడు పాత్రల్లో లింగ మూర్తి జీవిస్తారు. ఆయన ఉత్తమ ప్రదర్శనలకు పలు సత్కారాలు లభిం చాయి. కడప, కర్నూలు, విజయవాడ, రాజమండి వంటి ప్రాంతాల్లో కళాప్రదర్శనలు ఇచ్చారు. 2024లో అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం అందుకున్నారు.