Share News

సేవాభావంతో గుర్తింపు సాధ్యం: కలెక్టర్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:56 PM

సేవా భావంతో విద్యార్థులకు గుర్తిం పు, క్రమశిక్షణ సాధ్యమవుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. రాష్ట్ర స్థాయి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం చిలకపాలెం శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ప్రారంభమైంది.

సేవాభావంతో గుర్తింపు సాధ్యం: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

రాష్ట్రస్థాయి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

ఎచ్చెర్ల రూరల్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సేవా భావంతో విద్యార్థులకు గుర్తిం పు, క్రమశిక్షణ సాధ్యమవుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. రాష్ట్ర స్థాయి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం చిలకపాలెం శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా కార్య క్రమాలు అలవరచుకునేందుకు 8 నుంచి 18 ఏళ్ల మధ్య విద్యార్థులకు జూనియర్‌ రెడ్‌క్రాస్‌ విభాగం మంచి అవకాశం కల్పిస్తోందన్నారు. శిక్షణలోని అంశాలను తెలుసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ చైర్మన్‌ వైడీ రామారావు మాట్లాడుతూ.. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 130 మంది పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ రాష్ట్రశాఖ జనరల్‌ సెక్రటరీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అశ్వనీ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహన్‌రావు, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.సుధీర్‌, ట్రెజరర్‌ కె.దుర్గాశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

తొలిరోజు విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి ఇతివృత్తంగా ఈ ప్రదర్శనల్లో కళాకారులు తమ హావభావాలతో ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. కళాకారు లను నిర్వాహకులు అభినందించారు.

Updated Date - Oct 10 , 2026 | 11:57 PM