Share News

టీడీపీలో చేరిన ప్రతిఒక్కరికీ గుర్తింపు

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:35 AM

టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని వ్యవసాయశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

 టీడీపీలో చేరిన ప్రతిఒక్కరికీ గుర్తింపు
టీడీపీలోకి వైసీపీ నాయకులను ఆహ్వానిస్తున్న అచ్చెన్నాయుడు

  • వ్యవసాయశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, అక్టోబరు 26(ఆంఽధ్రజ్యోతి): టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని వ్యవసాయశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం నిమ్మాడ టీడీపీ కార్యాలయంలో టెక్కలి మండలంలోని తొలుసూరిపల్లికి చెందిన 15 వైసీపీ కుటుంబాలు, నందిగాం పంచాయతీకి చెందిన 25 మంది వైసీపీ కార్యకర్తలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కండువ వేసి పార్టీలోకి సాధారణంగా అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక నాయకులతో కలిసి పనిచేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:35 AM