Share News

గౌతు లచ్చన్న ఆశయ సాధనే లక్ష్యం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:55 PM

Gouthu Latchanna's Birth Anniversary ‘వెనుకబడిన తరగతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం పోరాడిన బహుజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న ఆశయాల సాధనే మనందరి లక్ష్యం కావాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

గౌతు లచ్చన్న ఆశయ సాధనే లక్ష్యం
గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మాజీమంత్రి శివాజీ, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, శంకర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘వెనుకబడిన తరగతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం పోరాడిన బహుజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న ఆశయాల సాధనే మనందరి లక్ష్యం కావాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, లచ్చన్న కుమారుడు, మాజీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీ.. లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు పాదయాత్ర చేపట్టి బీసీల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. సర్దార్‌ బిరుదుకు గౌరవం తెచ్చిన మహానాయకులు వల్లభాయ్‌పటేల్‌, లచ్చన్న మాత్రమేనన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వంటి మహనీయులతో లచ్చన్నకు గల సాన్నిహిత్యం, గురువులపై ఆయన చూపిన భక్తి.. భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ, తాను లచ్చన్న శిష్యుడినని, అంకితభావం, క్రమశిక్షణ ఆయన నుంచే నేర్చుకున్నానని తెలిపారు. మాజీమంత్రి శివాజీ మాట్లాడుతూ తండ్రి చూపిన మార్గంలో ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. అంతకుముందు డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ వద్ద లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లచ్చన్న జీవిత చరిత్రను తెలిపే ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, ఆర్డీవో సాయిప్రత్యూష, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విశ్వప్రసాద్‌, ఏఈడీసీ డైరెక్టర్‌ పీఎంజే బాబు, బీసీ వెల్ఫేర్‌ అధికారి అనూరాధ, శ్రీ శయన సంఘ పెద్దలు పాల్గొన్నారు. .

Updated Date - Aug 16 , 2026 | 11:55 PM