Share News

ఇతరుల శ్రేయస్సు కోరేదే అసలైన సాహిత్యం

ABN , Publish Date - May 25 , 2026 | 12:10 AM

Janasahithi Mahasabha ఇతరుల శ్రేయస్సు కోరేదే అసలైన సాహిత్యం అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన జన సాహితి 13వ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కవులు, కళాకారులు సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారని, వారివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఇతరుల శ్రేయస్సు కోరేదే అసలైన సాహిత్యం
‘సాహిత్య సమాలోచన’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్‌ చలమేశ్వర్‌, తదితరులు

  • సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌

  • యుద్ధాలకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలు రావాలి

  • జనసాహితి మహాసభలో వక్తల పిలుపు

  • శ్రీకాకుళం లీగల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఇతరుల శ్రేయస్సు కోరేదే అసలైన సాహిత్యం అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన జన సాహితి 13వ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కవులు, కళాకారులు సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారని, వారివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వాటిని సాహిత్యకారులు ఉపయోగించడంలో ముందుండాలని కోరారు. జనసాహితి వంటి సంస్థలు సాంకేతికతను ఉపయోగించడంలో ముందుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఆకలి మానవుని ప్రాథమిక సమస్య అని, దానిని పరిష్కరించే కార్యాచరణ వైపు ప్రోత్సహించే సాహిత్యం ఎంతైనా అవసరం ఉందన్నారు. సమాజంలో అసమానతలకు అసలైన కారణాలు ఆవిష్కరించే దిశగా సాహిత్యం ఉండాలని అన్నారు. ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ.. యుద్ధాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకే యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మహాసభలో యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కీలకపత్రాన్ని ప్రవేశపెట్టారు. సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కళ కాసుల కోసం కాదని, ప్రజల కోసమన్నారు. సమాజానికి ఉపయోగపడే ఏ కళారూపమైనా చిరకాలం వర్ధిల్లుతుందని చెప్పారు. సమాజం ఎప్పుడూ మంచివాళ్లతోనే నిండి ఉండాలని, అప్పుడే దేశానికి మంచి జరుగుతుందన్నారు. యుద్ధాలకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బరంపురానికి చెందిన తుర్లపాటి రాజేశ్వరి రాసిన సాహిత్య సమాలోచన అనే పున్తకాన్ని జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. ‘మా బాల్యం’, ‘తరగతిగది నా ఆచరణ’ ‘ఐఎంఎఫ్‌ అప్పు పతన సంస్కృతి ముప్పు’, ‘సరిహద్దులు ఎరగని స్వప్నాలు’ వంటి పుస్తకాలను వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసాహితి అధ్యక్షుడు దివి కుమార్‌, ప్రధాన కార్యదర్శి బి.అరుణ, కోశాధికారి శాంతికుమార్‌, రాష్ట్ర నాయకుడు జీవీ కృష్ణయ్య, ఎన్జీవో నాయకుడు ఆర్‌.వేణుగోపాల్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పోలినాయుడు, ప్రజాసాహితి మాస సంపాదకుడు పీఎస్‌ నాగరాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, కొప్పల భానుమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 12:10 AM