నగర పోరుకు సిద్ధం
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:26 AM
శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల సమరా నికి అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.
నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన
60 వార్డుల పరిధిలో ఎంపిక పూర్తి
ఫ వార్డు కార్యాలయాల్లో జాబితాల ప్రదర్శన
శ్రీకాకుళం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల సమరా నికి అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు కమిషనర్ శ్రావణ్‌కుమార్ మంగళ వారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నగర పరిధి లోని 60 వార్డులకు సంబంధించి అధికారులు పోలింగ్ కేంద్రా ల వివరాలను పొందుపరిచారు. ఈ జాబితా ప్రకారం.. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు (ఎంపీపీ, జడ్పీ, మున్సిపల్ స్కూల్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, అంగ న్‌వాడీ కేంద్రాలు, జడ్పీ కార్యాలయాలు, వ్యవసాయ, అటవీ, ఇరిగేషన్ శాఖల కార్యాలయాల్లో పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలన్నింటినీ మహి ళలు, పురుషులకు వేర్వేరుగా కాకుండా.. ఓటర్లందరూ ఉమ్మడి గా వినియోగించుకునేలా రూపొం దించారు. ఒక్కో బూత్‌లో ఓటర్ల సంఖ్య రద్దీని బట్టి భవనాల్లోనే వేర్వేరు గదులను పోలింగ్ కేంద్రా లుగా విభజించి జాబితాలో స్పష్టం గా పేర్కొన్నారు.
పోలింగ్ జాబితాలోని ముఖ్యాంశాలు
శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి నుంచి 60 వార్డులకు పోలింగ్ కేంద్రాల ఖరారు.
పీఎస్‌ఎన్‌ఎంసీహెచ్ స్కూల్, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ తదితర విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు.
మహిళలు, పురుషులకు వేర్వేరు బూత్‌లు లేకుం డా అన్ని కేంద్రాలను ‘ఆల్ ఓటర్స్’ విధానంలోనే కేటాయింపు.