Share News

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:00 AM

: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మామిడి గోవిందరావు కలిశారు.

 స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం
పల్లా శ్రీనివాసరావుకు సమస్యలు వివరిస్తున్న ఎంజీఆర్‌:

పాతపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మామిడి గోవిందరావు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి పార్టీశ్రేణులతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. పార్టీ అధిష్ఠానం రూపొందించిన కార్యక్రమాల అమలుపై చర్చించారు. పార్టీ మరింత బలోపేతం దిశగా చేపట్టాల్సిన అంశా లను వివరించారు.

Updated Date - Aug 17 , 2026 | 12:00 AM