Share News

ఆక్రమణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:09 AM

తాము చెరువులు, కొండలు ఆక్రమిం చుకున్నామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, నిరూపిస్తే దేనికైనా తాము సిద్ధమని, లేకుంటే ఆయన ఊరు విడిచి వెళ్లిపోతా రా? అంటూ టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు.

ఆక్రమణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే
విలేకరులతో మాట్లాడుతున్న ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ నాయకులు

  • మాజీ మంత్రి సీదిరికి టీడీపీ నాయకుల సవాల్‌

పలాస, జనవరి 11(ఆంధ్రజ్యోతి): తాము చెరువులు, కొండలు ఆక్రమిం చుకున్నామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, నిరూపిస్తే దేనికైనా తాము సిద్ధమని, లేకుంటే ఆయన ఊరు విడిచి వెళ్లిపోతా రా? అంటూ టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు. మాజీ మంత్రి అప్పలరాజు జగన్నాథసాగరం చెరువును టీడీపీ నాయకులు కబ్జా చేశారని, దీని వెనుక ఎమ్మె లే ్య శిరీష ఉన్నారంటూ ఆరోపణలు చేయడంపై ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ టీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. జగన్నాథసాగరం చెరువు గురిం చి మాజీ మంత్రికి అసలు తెలుసా అని ప్రశ్నించారు. తప్పుచేయవద్దని చెబుతు న్న ఘన చరిత్ర ఎమ్మెల్యే శిరీషకు ఉందని, కబ్జాలు చేసి, కొండలు పిండిచేసి అ మ్ముకున్న చరిత్ర మీకు ఉందని ఆరోపించారు. సూదికొండ, నెమలినారాయణపు రం కొండ, కోసంగిపురం రోడ్డులో ప్రభుత్వ గృహాల వద్ద ఉన ్న కొండలు ఎవరు కొళ్లగొట్టారో అందరికి తెలుసన్నారు. రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు గాలి కృష్ణారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:09 AM