Share News

ఘనంగా రవిశంకర్‌ గురూజీ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - May 14 , 2026 | 12:19 AM

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ 70వ జన్మదిన వేడుకలు బాపూజీ కళామం దిర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రవిశంకర్‌ గురూజీ  జన్మదిన వేడుకలు
రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, మే 13(ఆంధ్రజ్యోతి): ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ 70వ జన్మదిన వేడుకలు బాపూజీ కళామం దిర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గురు పూజో త్సవం నిర్వహించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శన, మహా సత్సంగం చేపట్టారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గాయకులు ఆధ్యాత్మిక కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో డా.కె.అమ్మన్నాయుడు, శిక్షకులు సుధా రాణి, రేణుక, కల్పన, ఆదినారాయణ, పద్మావతి, ఎన్‌.రేణుక, గోవిం దరావు, సురేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గొండు శంకర్‌ రక్తదానం

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ గురూజీ జన్మదినం సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ స్థానిక రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ సెంటర్‌లో రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సభ్యులు ఎం. కల్యాణ చక్రవర్తి, ఎ.ప్రసాదరావు, ఏవో నర్సింగరావు, బి.సతీష్‌ కుమార్‌, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:19 AM