ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:20 AM
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటు పడిన ఓ ఉపాధ్యాయుడి పదవీ విరమణ సందర్భంగా గ్రామస్థులు అరుదైన గౌరవం కలిగించారు.
రణస్థలం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటు పడిన ఓ ఉపాధ్యాయుడి పదవీ విరమణ సందర్భంగా గ్రామస్థులు అరుదైన గౌరవం కలిగించారు. పిట్టవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన సూరావజ్జుల నారాయణరావు సోమవారం పదవీ విరమణ చేశారు. అతడిని నాటు బండిపై కూర్చోబెట్టి గ్రామ స్థులు ఆ బండిని లాగుతూ ఊరి పొలిమేరల వరకు సాగనంపారు. ఈచిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు పాఠశాలలో సత్కరించారు.