Share News

మున్సిపాలిటీలో శరవేగంగా అభివృద్ధి పనులు

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:23 AM

పలాస- కాశీబుగ్గ ము న్సిపాలిటీని శర వేగంతో అ భివృద్ధి చేశామని... తాము చేసిన అభివృద్ధిని చూసి కూటమికి ఓటు వేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజలను కోరారు.

మున్సిపాలిటీలో శరవేగంగా అభివృద్ధి పనులు
టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, అక్టో బరు 16 (ఆంధ్రజ్యోతి): పలాస- కాశీబుగ్గ ము న్సిపాలిటీని శర వేగంతో అ భివృద్ధి చేశామని... తాము చేసిన అభివృద్ధిని చూసి కూటమికి ఓటు వేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజలను కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని.. ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎటువంటి రివెంజ్‌ రాజకీయాలు ఉండవని అన్నారు. సోషల్‌ మీడియాలో నిజాలు అబద్ధాలు గాను, అబద్ధాలు నిజాలుగాను గతంలో రాశారుని... ఈసారి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు పెట్టడం, కులాల మధ్య కుంపటి పెడితే చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల నిర్వహణకు అంతా సహకరించాలని ఆమె కోరారు. స్థానిక ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. టిక్కెట్లు కేటాయించామని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులంతా గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీలోకి భారీగా చేరికలు

వజ్రపుకొత్తూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పెద్ద బాడాం పంచాయితీకి చెందిన మాజీ సర్పంచ్‌ పీత శంకర్‌ ఆధ్వర్యంలో పలువురు శుక్రవారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పీత పురుషోత్తం, కొర్ర గిరిబాబు, బాడ గణపతి తదితరులకు శుక్రవారం పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, కణితి సురేష్‌, ఉమా మహేశ్వరరావు, కర్ని రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:23 AM