మూలపేట నుంచి భోగాపురం వరకూ అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:06 AM
Employment for youth through industries and projects ‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోంది. మూలపేట నుంచి భోగాపురం వరకూ అభివృద్ధి పరుగులు పెడుతోంద’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ సూరాడవానిపేటలో ఆయన పర్యటించారు.
పరిశ్రమలు, ప్రాజెక్టులతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
మంత్రి అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోంది. మూలపేట నుంచి భోగాపురం వరకూ అభివృద్ధి పరుగులు పెడుతోంద’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ సూరాడవానిపేటలో ఆయన పర్యటించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘మూలపేట పోర్టు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సముద్రతీరాన్ని ఆనుకొని నాలుగు వరుసల జాతీయరహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ రహదారి పూర్తయితే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయి. మూలపేట సమీపాన రూ.2,250 కోట్లతో కోరమాండల్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. మూలపేట పోర్టు, దాని పరిసరాల్లో పరిశ్రమలతో స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయ’ని తెలిపారు. ‘టెక్కలి నియోజకవర్గంలో రూ.650 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు ప్రారంభించనున్నాం. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా వంశధార జలాలను అందించనున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నాం. మత్స్యకారులకు మరింత భరోసా కల్పించేలా వేటనిషేధ భృతి రూ.20వేలకు పెంచాం. మేఘవరంలో కొత్త విద్యుత్‌సబ్‌స్టేషన్ మంజూరు చేశామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. కార్యక్రమంలో ధర్మార్జున రెడ్డి, నౌపడ సత్యనారాయణ, సుగ్గు స్వరూప్‌రెడ్డి, రెడ్డి అప్పన్న, సూరాడ ధనరాజు, దాసురాజు పాల్గొన్నారు.