Share News

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:26 AM

నెలవంక పంచాయతీ పరిధిలోని ఓ గ్రా మానికి చెందిన మానసిక దివ్యాంగురాలి (29)పై అత్యాచారానికి పాల్పడిన డి.జోగారావు అలియాస్‌ చిన్నారెడ్డిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు.

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
కవిటి: వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నంనాయుడు

కవిటి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నెలవంక పంచాయతీ పరిధిలోని ఓ గ్రా మానికి చెందిన మానసిక దివ్యాంగురాలి (29)పై అత్యాచారానికి పాల్పడిన డి.జోగారావు అలియాస్‌ చిన్నారెడ్డిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. దివ్యాం గురాలైన ఆమె నెలవంక గ్రామంలో ఉన్న తన అక్క ఇంటికి తరచూ వెళ్లి వస్తుం డేది. ఈ క్రమంలో ఈ నెల 11న తన అక్క ఇంటికి వెళ్తున్నట్టు తల్లితో చెప్పి నడుచుకుని వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంది. ఆ రోజు రాత్రి నుంచి కడుపులో నొప్పిగా ఉందని దివ్యాంగురాలు తల్లితో చెప్పింది. వైద్యం చేయించినా తగ్గకపోవ టంతో తల్లి గట్టిగా ప్రశ్నించింది. దీంతో తన అక్క ఇంటికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన డి.జోగారావు తన చేయి పట్టుకొని వారి ఇంటిలోకి తీసు కెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు కవిటి ఎస్‌ఐ రవివర్మ నమోదు చేశారు. జోగారావుని ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ జంక్షన్‌ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. నిందితుడు జోగారావు నెలవంక పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు దూదమ్మ భర్త కావడం రాజకీయంగా కలకలం రేగింది.

చోరీ కేసులో ఇద్దరు..

రణస్థలం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు చోట్ల చోరీల కు పాల్పడిన ఇద్దరిని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం తెలిపిన వివరాల మేరకు.. గత నెల 23న లావేరు మండల పరిధిలోని ఆర్‌ఆర్‌ వైన్స్‌ షాప్‌లో రూ.15వేల నగదు, డీవీఆర్‌ బాక్స్‌, జీయో రోటరీ బాక్స్‌ చోరీ జరిగిననట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. దొంగతనం చేసిన వారి కోసం రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈనేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం సుభద్రా పురం జంక్షన్‌ వద్ద చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు ప్రభు కుమార్‌, టైరెడ్డి మోహన్‌ కుమార్‌ పోలీసులకు చిక్కారు. విజయవాడకు చెందిన ప్రభుకుమార్‌ 22 చోరీ కేసుల్లో జెలుకు వెళ్లాడని.. రాజమండ్రికి చెందిన టైరెడ్డి మోహన్‌ కుమార్‌ కూడా వివిధ కేసుల్లో జైలుకు వెళ్లినట్లు సీఐ తెలిపారు. వీరిద్దరికీ రాజ మండ్రి సెంట్రల్‌ జైలులో స్నేహం కుదిరిందని తెలిపారు. అప్పటి నుంచి 10 నేరాల వరకూ చేసినట్లు తెలిపారు. ఇద్దర్ని పట్టుకున్న లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరిని సీఐ అభినందించారు.

Updated Date - Mar 21 , 2026 | 12:26 AM