Share News

రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:42 PM

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూచిపూడి, భరత నాట్య ప్రదర్శలు చేస్తూ ప్రశంసలు అందు కుంటున్న రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం లభించింది.

రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం
స్ర్తీ వేషధారణలో నృత్యశ్రీ పురస్కారం అందుకుంటున్న రామకౌండిన్య

గుజరాతీపేట, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూచిపూడి, భరత నాట్య ప్రదర్శలు చేస్తూ ప్రశంసలు అందు కుంటున్న రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం లభించింది. మహా శివరాత్రి సందర్భంగా మహారాష్ట్రలోని భూసావల్‌లో నిర్వహించిన ‘నూపుర్‌ మహోత్సవం-2026’లో నగరానికి చెందిన శివశ్రీ నృత్యనికేతన్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ శిష్యుడైన రామ కౌండిన్యకు నూపుర్‌ కథక్‌ డ్యాన్స్‌ అకాడమీ ప్రతినిధులు రామాకాంత్‌ భాలేరావు, చారు భాలేరావు పురస్కారం అందించి అభినందించారు. నూపుర్‌ మహోత్సవంలో రామ కౌండిన్య స్ర్తీ వేషధారణలో కూచిపూడి నృత్యాభినయం చేసి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:42 PM