‘సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ’
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:09 AM
దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకు వచ్చి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలి పేందుకు కృషి చేసిన వ్యక్తి, దార్శనికుడు, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు.
అరసవల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకు వచ్చి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలి పేందుకు కృషి చేసిన వ్యక్తి, దార్శనికుడు, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం నగరంలోని రిమ్స్ కళాశాలలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి, కేంద్ర నిధు లు నేరుగా గ్రామాలకు అందేలా చేశార న్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పిం చి యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు రాజీవ్ అనిచ ఆయన ఆశయాలను నెరవేర్చాలన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు రెల్ల సురేష్, డీసీసీ పూర్వ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, ఉపాధ్యక్షు రాలు కేవీఎ ల్‌ఎస్ ఈశ్వరి, ఇజ్జురోతు రమణ, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఆబోతుల వెంకటనాయుడు, కూరాకుల వెంకటరావు, బొచ్చ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.