వత్సవలసలో రాజమ్మ సంబరాలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:15 PM
వత్సవలసలో రాజరాజేశ్వరి(రాజమ్మ) సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
గార, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): వత్సవలసలో రాజరాజేశ్వరి(రాజమ్మ) సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో జరిగే ఈ ఉత్సవాలకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. తొలివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శనివారం రాత్రికే తరలివచ్చి ఆదివారం ఉదయం సముద్ర స్నానాలు ఆచరించి భూలోకమ్మ, రాజమ్మలను దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు. సీఐలు బి.ప్రసాదరావు, పైడిపు నాయుడు, గారఎస్‌ఐ గంగరాజు, ఏఎస్‌ఐ చంద్రమోహన్, సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
వేణుగోపాలుని కల్యాణం
శ్వేతగిరిపై వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు.ఉదయం పలువురు దంప తులు కల్యాణంలో పాల్గొన్నారు. దేవస్థానం అర్చకులు వేణుగోపాలచార్యులు, సాయిశర్మ పలువురు రుత్వికులు వేదమంత్రాల మధ్య కల్యాణం నిర్వహించా రు.ట్రస్టుబోర్డు చైర్మన్ సుగ్గు మధురెడ్డి దంపతులు, ట్రస్టుబోర్డు సభ్యులు గుండ భాస్కరరావు, కె.ఆదినారాయణ, బోర వెంకటరావు, బోర వాసుదేవరా వుతోపాటు ఇతర పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.