మేలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:53 PM
ww
కాశీబుగ్గ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి మే నెలలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం కాశీబుగ్గ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా చినబడాం, మూడురోడ్ల జంక్షన్ వైపు ఒకే సమయంలో పనులు జరిగేలా చర్యలుతీసుకోవాలని స్థానిక ఏజెన్సీలకు సూచించారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రాగానే కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు చొరవతో రైల్వే మంత్రి, అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయడమే కాకుండా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో డబ్బులు,స్థలాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఆమె వెంట ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబు రావు, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణ, మల్లా శ్రీనివాస్‌రావు, నరేంద్ర (చిన్ని), రవిశంకర్ గుప్తా, గోవింద పాల్గొన్నారు.