Share News

ఇసుక అక్రమ తవ్వకాలపై దాడులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:02 AM

శ్రీకాకుళం రూరల్‌ పరిధి కరజాడ గ్రామంలో ఇసుకను అక్రమంగా తవ్వుతూ తరలిస్తున్న వారిపై రెవెన్యూ, పోలీస్‌, గనుల శాఖల అధికారులు శుక్రవారం సంయు క్తంగా దాడులు చేశారు.

 ఇసుక అక్రమ తవ్వకాలపై దాడులు
ఇసుక తవ్వకాలను పరిశీలిస్తున్న అధికారులు

రెండు లారీలు సీజ్‌

శ్రీకాకుళం అర్బన్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ పరిధి కరజాడ గ్రామంలో ఇసుకను అక్రమంగా తవ్వుతూ తరలిస్తున్న వారిపై రెవెన్యూ, పోలీస్‌, గనుల శాఖల అధికారులు శుక్రవారం సంయు క్తంగా దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో తహసీల్దార్‌ శిర్ల గణపతి, ఎస్‌ఐ కేవీ సురేష్‌, మైనింగ్‌ ఏపీడీ మాణిక్యాలరావు సిబ్బం దితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇసుక లోడుతో వెళుతున్న రెండు లారీలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. అనంతరం వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే సహిం చేది లేదని, ప్రకృతి వనరుల దోపిడీకి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటా మని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - Aug 29 , 2026 | 12:02 AM