సముద్రంలో తెప్ప బోల్తా.. తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:40 AM
డోకులపాడు తీరంలో తెప్పబోల్తాపడిన ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షతంగా బయటప డ్డారు.
నలుగురు మత్స్యకారులు సురక్షితం
వజ్రపుకొత్తూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): డోకులపాడు తీరంలో తెప్పబోల్తాపడిన ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షతంగా బయటప డ్డారు. డోకులపాడుకు చెందిన పుసే కామేష్, పుసే దానయ్య, వడ్డి కామేష్, మాగుపల్లి లక్ష్మయ్య శని వారం తెప్పపై చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పెద్దపెద్ద అలలు తాకడంతో బోల్తా పడింది. దీంతో తెప్పపై ఉన్న నలుగురు మత్స్య కారులు సముద్రంలోకి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్య్సకారులు ఈదుకుంటూ తెప్పపైకి చేరి ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నారు. కాగా ఈ ఘటనను ఒడ్డున ఉన్న యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.