వంశధార పరీవాహకంలో రబీ వరి సాగు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:43 PM
మండలంలో వంశధార పరివాహక ప్రాం తం దిగువున రబీలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వంశ ధారప్రధాన ఎడమ కాలువ పరిధిలో ఏటా ఖరీఫ్ అనంతరం ఇక్కడ వరి సాగు చేస్తున్న విషయం విదితమే.
నందిగాం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మండలంలో వంశధార పరివాహక ప్రాం తం దిగువున రబీలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వంశ ధారప్రధాన ఎడమ కాలువ పరిధిలో ఏటా ఖరీఫ్ అనంతరం ఇక్కడ వరి సాగు చేస్తున్న విషయం విదితమే. గతఏడాది అక్టోబరు, నవంబరులో కురిసిన వర్షాలకు వంశ ధార ఆధారిత చెరువుల్లో నీరుచేరింది. దీనికితోడు గొట్టాబ్యారేజీ, వంశధార రిజర్వాయర్‌లో ఆశించిన నీటి నిల్వలుఉన్నాయి. దీంతో రబీలో వరి పంటకు నీటి సమస్యకు డోకా ఉండదని భావించి సాగుకు ముందుకొస్తున్నారు.నందిగాం, పెం టూరు, నరేంద్రపురం,పెద్దతామరాపల్లి, గొల్లూరు, నర్శిపురం, దేవళభద్ర, జల్ల పల్లి, దిమిలాడ తదితర గ్రామాల్లో నాట్లు వేసేందుకు పంట పొలాలను దమ్ము చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో నారుమళ్లకు ఎరువు చల్లే పని, ఆకుతీతలు, ఉబాలుపనులు చేస్తున్నారు. రబీలో వరితోపాటు వేరుశన గ, పొద్దుతిరుగుడు, నువ్వు తదితర ఆరుతడి పంటలను శివరాంబపురం, వల్ల భరాయుడుపేట, దేవాడ తదితర గ్రామాల్లో సాగుచేస్తున్నారు.