ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:00 AM
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిశీ లించి పరిష్క రించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికను నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజ ల నుంచి 167 వినతులను స్వీకరించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 27(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిశీ లించి పరిష్క రించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికను నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజ ల నుంచి 167 వినతులను స్వీకరించారు. అర్జీల పరిష్కా రంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హె చ్చరించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘మా ఊరులోనే చదివేలా చర్యలు తీసుకోండి’
పిల్లలు మా గ్రామ పాఠశాలలోనే చదువుకునేలా అవ కాశం కల్పించాలని పోలాకి మండలం పాలవలస గ్రామస్థు లు వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందించారు. తమ ఊరిలో గతంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాల ఉండేదని, అయితే తరగతు లకు తగిన విద్యార్థులు లేని కారణంగా 3, 4, 5 తరగతులను రద్దు చేశారని, దీంతో చిన్న పిల్లలు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిరియాగ్రహారం, బెలమర గ్రామాలకు చదువు కునేందుకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామంలో సుమారు 40 మంది వరకు పిల్లలు 3, 4, 5 తరగతుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
‘ఆదరిస్తామని.. బయటకు గెంటేసింది’
తన పేరున 25 సెంట్ల భూమి ఉందని, తనకు అదే ఆధారమని, అయితే తన మన వరాలు తనను ఆదరిస్తానని చెప్పి ఆ భూమిని ఆమె పేరున రాయించుకుని, పని పూర్తయిన తరువాత బయ టకు గెంటే సిందని నరసన్నపేట మండ లం జమ్ము గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తంగి గన్నెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లింది. ఆదరిస్తానని మాటమాటలు చెప్పిందని, ఇప్పుడు హింసిస్తూ.. అవ మానాలకు గురిచేస్తోందని, తనకు వచ్చే రూ.4 వేల వృద్ధాప్య పింఛన్‌ను లాక్కుని బయటకు గెం టేసిందని ఆవేదన వ్యక్తంచేసింది. తన భూమిని తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ను వేడుకుంది.
‘రెండు నెలలుగా రోడ్డుపైనే మురుగునీరు’
రెండు నెలలుగా కాలువల నుంచి మురుగు నీరు రోడ్డుపైకి చేరి నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదని ఆమదా లవలస మండలం అక్కి వరం గ్రామ పంచాయతీ కొత్తరోడ్డు జంక్షన్, మహసాహెబ్‌పేట, చిన్నగోపీనగరం గ్రామాలకు చెం దిన ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మురుగునీరు రోడ్లపై నిలువ ఉండడంతో దుర్గంధంతో పాటు వ్యాధుల బారిన పడుతున్నామని, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతు న్నా యన్నారు. రోడ్డు నాచు పట్టి తరచూ ప్రమాదాలు జరిగి ప్రజలు గాయాలబారిన పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని వేడు కున్నారు. సమస్యను సానుకూలంగా విన్న కలెక్టర్ తక్షణం ఆమదాలవలస ఎంపీడీవోకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగేనా విధులు నిర్వర్తించేందంటూ ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. తక్షణం సమస్యను పరిష్కరించి ఆ వివరాలను తనకు తెలియజేయాలని ఆదేశించారు.
కోర్టు భవన నిర్మాణంపై వినతి
ఆమదాలవలస, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకుందని, దీంతో భయాం దోళన మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందని, తగు చర్యలు తీసుకోవాలని ఆమ దాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మీబాయి కోరారు. ఈ మేరకు పలు వురు న్యాయవాదులతో గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కోర్టు భవనం పెచ్చులూడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తభవనం నిర్మాణం జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏజీపీ పైడి వరహానరసింహం, న్యాయవాదులు సీపాన గోవిందరావు, తమ్మినేని అన్నం నాయుడు, బొడ్డేపల్లి మోహన్‌రావు, వాడవలస రాజేశ్వరరావు, గురుగుబెల్లి ప్రభాకరరావు, గురుగుబెల్లి వెంకటరావు తదితరులున్నారు.