సరికొత్త పరిశోధనలకు క్వాంటమ్ టెక్నాలజీ దోహదం
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:22 AM
సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు క్వాం టమ్ టెక్నాలజీ ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని, ఇది సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు బాటలు వేస్తుందని జేఎన్‌టీయూ (విజయ నగరం) ఐటీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.జయ సుమ అన్నారు.
జేఎన్‌టీయూ (జీవీ) ఐటీ హెడ్, ప్రొఫెసర్ జయసుమ
ఎచ్చెర్ల, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు క్వాం టమ్ టెక్నాలజీ ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని, ఇది సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు బాటలు వేస్తుందని జేఎన్‌టీయూ (విజయ నగరం) ఐటీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.జయ సుమ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (ఐఎఫ్‌ఎస్‌టీ-2026) అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా క్వాంటమ్ కంప్యూ టింగ్ అంశంపై ఆమె పరిశోధనా పత్రం సమర్పిం చారు. క్వాంటమ్ సాంకేతికత ద్వారా భవిష్యత్‌లో మానవ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగు పడతాయి, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఈ పరిజ్ఞానం కీలక పాత్రను వివరించారు. కాలిఫోర్ని యాకు చెందిన ప్రొఫెసర్ గంజి పి.నాగరాజు, ఆంధ్రా యూనివర్సిటీ గణిత విభాగం ప్రొఫెసర్ జి.నానాజీ రావు, కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంవీ బసవేశ్వరరావు వర్చువల్‌గా పాల్గొని విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న అధు నాతన మార్పులను వివరించారు. కార్యక్రమానికి ఎం.అనూరాధ, ఎన్.లోకేశ్వరి అఽధ్యక్షత వహించగా కన్వీనర్లుగా ప్రొఫెసర్ పి.సుజాత, కె.స్వప్నవాహిని సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ పీఎం ఉషా పథకం ఆర్థిక సహకారంతో ఈ సదస్సును నిర్వహించారు. పలువురు పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.