Share News

నాణ్యత ప్రమాణాలు పాటించాలి: ఈఈ

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:49 PM

రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. రామభధ్రాపురం- చిలకపాలేం ప్రధానరహదారిలో భాగంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.

నాణ్యత ప్రమాణాలు పాటించాలి: ఈఈ
నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్న క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు

జి.సిగడాం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. రామభధ్రాపురం- చిలకపాలేం ప్రధానరహదారిలో భాగంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. గేదెలపేట నుంచి వాండ్రంగి రైల్యే బ్రిడ్జి వరకు రూ. 2.75 కోట్లతో నిర్మిస్తున్న 6.4 కిలో మీటర్లు మేర నాలుగు కిలోమీటర్లు మేర పనులు జరిగాయి. వీటిని క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది నిర్మాణంలో నాణ్యతను పరిశీలించారు. ఆయన వెంట క్వాలిటీ కంట్రోల్‌ డీఈ గౌరీశ్వరరావు, ఏఈఈ జగన్మోహన్‌రావు, ఆర్‌అండ్‌బీ డీఈ గణపతిరావు, ఏఈఈలు పిటీ రాజు, వాసు ఉన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:49 PM