నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:40 AM
రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సీతంపేట ఐటీడీఏ ఈఈ పి.రమా దేవి సూచించారు.
సీతంపేట ఐటీడీఏ ఈఈ రమాదేవి
నందిగాం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సీతంపేట ఐటీడీఏ ఈఈ పి.రమా దేవి సూచించారు. బుధవారం వల్లభరాయుడుపాడు - వేణుగోపాలపురం రహదారి నుంచి కొఠియా కొండపేట వెళ్లే రహదారి నిర్మాణ పనుల్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యతా ప్రమాణాలపై యంత్రంతో తనిఖీ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పది కాలాల పాటు వినియోగపడేలా పనులు చేపట్టి వారిలో ఆనందం నింపాలని అన్నారు. ఈ పరిశీలనలో డీఈఈ కృష్ణకుమార్, టీఏ సీహెచ్ సీతారాం తదితరులు ఉన్నారు.