Share News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:55 PM

మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం, రుచి కరమైన పదార్థాలను అందించే ఏర్పాట్లు చేయడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌బాబు నిబద్ధతకు నిదర్శమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం
రణస్థలం: విద్యార్థులతో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం, రుచి కరమైన పదార్థాలను అందించే ఏర్పాట్లు చేయడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌బాబు నిబద్ధతకు నిదర్శమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. పాతర్లపల్లి హైస్కూల్‌లో డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథ కాన్ని గురువారం పరిశీలించారు. అలాగే మండలంలోని ఓ పరిశ్రమ సౌజన్యం తో పాతర్లపల్లిలో 60 లక్షలతో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, బెండు మల్లేశ్వరరావు, రవి, గొర్లె సాయి, దుమ్ము అశోక్‌, వడ్డాది శ్రీను పాల్గొన్నారు.

ఫఎచ్చెర్ల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని భగీరథపురం గ్రామానికి చెందిన తంగి రమణకు రూ.2.01 లక్షలు విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గురువారం క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సాదు మల్లేష్‌, గొలివి అనంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:55 PM