నాణ్యమైన విద్య ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:22 AM
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్
బూర్జ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు కొల్లివలస డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో రూ.87 లక్షలతో నిర్మిం చిన స్మార్ట్ కిచెన్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సౌక ర్యాలతో కూడిన స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలి పారు. వంటశాలలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుకులం డీసీవో యశోదలక్ష్మి, ప్రిన్సిపాల్ రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రామ కృష్ణంనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు వి.రాంజీ, నగర కులం డైరెక్టర్ కన్నంనాయుడు, ఎంపీటీసీ విక్రం, సీతబాబు, తహసీల్దార్ పద్మావతి పాల్గొన్నారు.
‘సమష్టిగా మండల అభివృద్ధికి కృషి’
పొందూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మంచి వేదిక కావాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య చివరి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎన్నికల్లో ఎన్నికైన తరువాత సభ్యులు సమష్టిగా సహకరించుకుని ముందుకు సాగాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మండలంలో రూ.16 కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణం జరగ్గా, మరో రూ.26.72 కోట్లతో 14 రోడ్డు పనులకు ప్రతిపాదనలు పూర్తయ్యాయన్నారు. ఇదిలా ఉండ గా ఈనెల 24తో పండలపరిషత్ కార్యవర్గ పదవీ కాలం పూ ర్తి కానుండడంతో ఎంపీపీ ఉషారాణి, ఎంపీటీసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులను ఎంపీడీవో వాసుదేవు, తహసీల్దార్ ఆర్.వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్కరించారు.