Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ABN , Publish Date - May 25 , 2026 | 11:46 PM

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపా ధ్యాయులున్నారని, నాణ్యమైన విద్య అంది స్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం తోలాపి జడ్పీ హైస్కూ ల్‌ హెచ్‌ఎం అల్లెన ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
బడిపిలుస్తోంది ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పొందూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపా ధ్యాయులున్నారని, నాణ్యమైన విద్య అంది స్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం తోలాపి జడ్పీ హైస్కూ ల్‌ హెచ్‌ఎం అల్లెన ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్‌, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కాపా డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. కూటమి ప్రభు త్వంలో పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం శుభపరిణామమన్నా రు. విద్యార్ధుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు అందిస్తున్న సదుపాయాలను వివరించారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ తల్లిదండ్రులు అనుమతి పత్రం అందించారు. ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేసి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందిం చారు.

తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు గదుల నిర్మాణా నికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రవికుమార్‌ ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ వేణు గోపాలరావును ఫోన్‌లో ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతు లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్‌ ఏఈ దయా సాగర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఎం.వాగ్గేవి, పి.రాజారావు, క్లస్టర్‌ హెచ్‌ఎం పి.సూర్యారావు, నాయకులు పొన్నాడ రామారావు, దుంపల సత్యం, పి.అప్పల నాయడు, పి.గంగాధర్‌, పి.రమణమూర్తి, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:46 PM