Share News

ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:58 PM

ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య అందజేస్తున్నామని ప్రిన్సిపాల్‌ కె.సింహాచలంనాయుడు తెలిపారు.

  ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య
పొందూరు: ప్రభుత్వ పాఠశాలలో వసతులను వివరిస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు:

కవిటి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య అందజేస్తున్నామని ప్రిన్సిపాల్‌ కె.సింహాచలంనాయుడు తెలిపారు. గురువారం స్థానిక జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో సిబ్బంది కవిటిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదం డ్రులకు ప్రభుత్వ కళాశాల ప్రాధాన్యం, ఆవశ్యకతను వివరించారు. విద్యా ర్థులకు అందజేస్తున్న సౌకర్యాలు, సిబ్బంది వివరాలు, వసతులపై తెలియజేశారు.

ఫ పొందూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని ఎంఈవో -1, 2 వాగ్ధేవి, పి.రాజారావు తెలిపారు. గురువారం పొందూరులో ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రవేశాలకోసం ఎంఈవోల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు బట్టీపట్టేవిధానంతో ముందుకు వెళ్తుండడం వల్ల మానసిక వికాసం లేకుండా పోతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశా లల్లో అత్యాధునిక సదుపాయాలు, మౌలికవసతులు అందుబా టులోకి వచ్చాయని చెప్పారు.

Updated Date - Apr 09 , 2026 | 11:58 PM