రేషన్ కష్టాలకు చెక్
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:45 PM
కోదూరు పంచాయతీ పరిధిలోని ప్రహరాజపాలెం, కోదూర గ్రామాల ప్రజలకు రేషన్ కష్టాలు తప్పాయి.
- ప్రహరాజపాలెంలో డిపో ఏర్పాటు
- రెండు గ్రామాల ప్రజల ఆనందం
పాతపట్నంరూరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కోదూరు పంచాయతీ పరిధిలోని ప్రహరాజపాలెం, కోదూర గ్రామాల ప్రజలకు రేషన్ కష్టాలు తప్పాయి. గతంలో కోదూరు పంచాయతీ ప్రజలు రేషన్ కోసం సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నపద్మాపురం గ్రా మానికి వెళ్లాల్సి ఉండేది. సరైన రవాణా లేకపోవడం, అక్కడ మొబైల్ సిగ్నల్ సమస్యతో బయోమెట్రిక్ పడక ఒకటికి, రెండుసార్లు తిరగా ల్సిన పరిస్థితులు నెలకొనేవి. ఈ ఇబ్బందులపై గత డిసెంబరులో ఈ రెండు గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కలిపి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆయన జనవరి నాటికి స్థానికంగానే రేషన్ అందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా రు. ఈ మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రహరాజపాలెంలో డిపో ఏర్పాటు చేసి ఈ నెల రేషన్ బియ్యం పంపిణీ చేశారు. దీంతో ప్రహరాజపాలెం, కోదూరు గ్రామ పజ్రలకు ప్రయాణ భారంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. తమ సమస్యను తక్షణమే పరిష్క రించినందుకు ఆయా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గోవిందరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.