కాలువలో చేయిపెట్టి.. చెత్తను తీసి
ABN , Publish Date - May 10 , 2026 | 12:25 AM
నగరంలో శనివారం అరుదైన సన్ని వేశం చోటు చేసుకొంది. నీలమ్మతల్లి ఉత్సవాలు జరగనున్న ప్రాంతాలైన గైనేటి వీధి, పెద్ద బరాటం వీధి, కోరాడ వీధుల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. కాలువల్లో మురికి, చెత్తా చెదారాలు ఉండడాన్ని గమనించి ఒక్కసారి రంగంలోకి దిగారు. కాలువ వద్దకు వెళ్లి అందులో ఉన్న చెత్తను స్వయంగా చేతులతో తొలగించారు.
మురుగు తీసే విధానంపై పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే క్లాస్
పండగల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి: శంకర్
శ్రీకాకుళం లీగల్/అరసవల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): నగరంలో శనివారం అరుదైన సన్ని వేశం చోటు చేసుకొంది. నీలమ్మతల్లి ఉత్సవాలు జరగనున్న ప్రాంతాలైన గైనేటి వీధి, పెద్ద బరాటం వీధి, కోరాడ వీధుల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. కాలువల్లో మురికి, చెత్తా చెదారాలు ఉండడాన్ని గమనించి ఒక్కసారి రంగంలోకి దిగారు. కాలువ వద్దకు వెళ్లి అందులో ఉన్న చెత్తను స్వయంగా చేతులతో తొలగించారు. కాలువ పక్క మోకా ళ్లపై కూర్చుని చెత్తను చేతులతో తీయడంతో పాటు కర్రను పట్టుకుని మురికిని తొలగించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారి అవాక్కై.. వద్దని చెబుతున్నా ఆయ న రంగంలోకి దిగడంతో పారిశుధ్య సిబ్బంది పరుగున వచ్చి ఆయన చేతిలో ఉన్న చెత్త ను తీసే కర్రను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య సిబ్బందికి క్లాస్ తీసు కున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని, పారిశుధ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పండగల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్య లు చేపట్టాలని కమిషనర్ హెచ్.కూర్మారావుకు సూచించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.