మాటల్లో పెట్టి.. లొకేషన్ గుర్తించి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:06 AM
క్షణికావేశంలో ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ప్రాణాన్ని డయల్ 112 సిబ్బంది, పోలీసులు సమయ స్ఫూర్తితో కాపాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాధితు రాలి ఆచూకీ కనిపెట్టి మృత్యువు అంచుల నుంచి రక్షించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఇందు కు సంబంధించిన వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో విడుదలచేశారు.
112 టోల్‌ఫ్రీ సిబ్బంది సాయంతో మహిళ ప్రాణం కాపాడిన పోలీసులు
శ్రీకాకుళం క్రైం/పోలాకి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ప్రాణాన్ని డయల్ 112 సిబ్బంది, పోలీసులు సమయ స్ఫూర్తితో కాపాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాధితు రాలి ఆచూకీ కనిపెట్టి మృత్యువు అంచుల నుంచి రక్షించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఇందు కు సంబంధించిన వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో విడుదలచేశారు. పోలాకి మండలానికి చెం దిన ఓ మహిళ మానసిక ఒత్తిడికి గురై గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాను రైలు కిం ద పడి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యుల కు ఫోన్ చేసి చెప్పడంతో వారంతా ఆందోళనకు గుర య్యారు. వెంటనే 112కు ఫోన్ చేసి విషయం చెప్పడం తో కంట్రోల్‌రూం సిబ్బంది పోలాకి ఎస్‌ఐ రంజిత్ కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన వెంటనే ఆ మహిళకు ఫోన్ చేసి మాటల్లో పెడుతూనే టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె ఎక్కడుందో గుర్తించే ప్రయ త్నం చేశారు. ఆమె ఆమదాలవలస రైల్వేస్టేషన్ పరిస రాల్లో ఉన్నట్లు నిర్ధారించారు. తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమదాలవలస లోకల్ పోలీ సులు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైలు పట్టాల వైపు వెళ్తున్న ఆమెను గుర్తించి అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమన్వయంతో పనిచేసి ఒక ప్రాణాన్ని కాపాడిన 112న సిబ్బందిని, పోలాకి, ఆమదాలవలస, జీఆర్పీ పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. ఆపద సమయంలో 112కు కాలల చేయాలని ఎస్పీ సూచించారు.