సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:36 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సిబ్బంది సమయపాలన పాటిం చాలని మందస ఐసీడీఎస్ పీవో పి.అరుణ తెలిపారు.
హరిపురం, ఫిబ్రవరి10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సిబ్బంది సమయపాలన పాటిం చాలని మందస ఐసీడీఎస్ పీవో పి.అరుణ తెలిపారు. విధిగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలు గు గంటలవరకు ఉండాలని పేర్కొన్నారు. మంగళవా రం మందస మండలంలోని మఖరజోల, హరిపురం, మందస అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటించి, రికార్డుల ను తనిఖీచేశారు. సిలబస్ ప్రకారం ప్రీస్కూల్‌లో చిన్నా రులకు బోధించాలని, మోనూప్రకారం పౌష్టికాహారం అందించాలని, పరిశరాలు పరిశభ్రంగా ఉంచాలని సూ చించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.