Share News

సమయపాలన పాటించాలి: ఎంఈవో

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:06 AM

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఎంఈవో-2 ప్రసాదరావు కోరారు. శనివారం రావిపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో రికార్డులు పరిశీలించారు.

సమయపాలన పాటించాలి: ఎంఈవో
మధ్యాహ్న భోజనం వంటలు పరిశీలిస్తున్న ఎంఈవో-2 ప్రసాదరావు :

జలుమూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఎంఈవో-2 ప్రసాదరావు కోరారు. శనివారం రావిపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభానికి ముందుగా విద్యార్థులతో ప్రార్థన నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన గుణాత్మకమైన విద్యనందించి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నారు.అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి మెనూ ప్రకారం పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలు, వంటగది, వంట పాత్రలు పరిశుభ్రంగా ఉంచాలని వంట నిర్వాహకులకు సూచించారు.

Updated Date - Aug 02 , 2026 | 12:06 AM