సమయపాలన అత్యంత ముఖ్యం
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:53 PM
ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యాధి కారులు, సిబ్బం ది సమయ పాలనకు అత్యంత ప్రాధాన్య మివ్వాలని... ప్రజలకు ఉత్తమ సేవలం దించాలని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ అధికారి(పీఓ) కె.శివరంజని స్పష్టం చేశారు.
ఎల్.ఎన్.పేట, ఆగష్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యాధి కారులు, సిబ్బం ది సమయ పాలనకు అత్యంత ప్రాధాన్య మివ్వాలని... ప్రజలకు ఉత్తమ సేవలం దించాలని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ అధికారి(పీఓ) కె.శివరంజని స్పష్టం చేశారు. లక్ష్మీనర్సుపేట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని... రోగులకు వైద్య సేవలందించడం లేదని శ్రీహరిమహాపాత్రో ఇటీవల కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారు. ఈమేరకు పీవో శివరంజని సోమవారం వైద్యాధికారులు, సిబ్బందిపై విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుడు శ్రీహరి మహాపాత్రో పాటు మరికొంతమంది గ్రామస్థులు విచారణకు హాజరయ్యారు. ఫిర్యాదుదారుని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది హాజరు పట్టికలతో పాటు ఇతర రికార్డులను పరిశీలించారు. గ్రామంలో ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని వైద్యాధికారులు, సిబ్బంది తమకునచ్చిన సమయానికి వచ్చి వెళ్లిపోతున్నారని శివరంజిని దృష్టికి తీసుకువచ్చారు. ఆ తరువాత వైద్యాధికారులు బి.జీవేశ్వరరావు, జాహ్నవిచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
విచారణకు సంబంధించిన నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అందించనున్నట్టు శివరంజని తెలిపారు. వైద్యం కోసం వచ్చిన బాధితులతో సంయమనంతో వ్యవహరించాలని వైద్యాధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, రోగుల నుంచి ఫిర్యాదులు అందినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం పీహెచ్‌సీలో బెడ్లను పరిశీలించారు.