Share News

సంక్షేమ పథకాలపై ప్రచారం అవసరం

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:24 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలపై ప్రచారం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం కత్తెరవానిపేటలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

సంక్షేమ పథకాలపై ప్రచారం అవసరం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలపై ప్రచారం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం కత్తెరవానిపేటలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు సమన్వయంతో సిద్ధమవ్వాలని శ్రేణులకు సూచించారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీలను దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ పార్టీ విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించేలా చూడాలన్నారు ఈ సమావేశంలో వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:24 AM