Share News

కూటమి ప్రభుత్వంతో ప్రజా సంక్షేమం: అశోక్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:56 PM

కూటమి ప్రభుత్వం తో ప్రజాసంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

 కూటమి ప్రభుత్వంతో ప్రజా సంక్షేమం: అశోక్‌
కరపత్రాలిచ్చి వివరిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తో ప్రజాసంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. గురువారం జగతి పంచాయతీ చిన్నకర్రివానిపాలెం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహిం చారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాల కరప త్రాలు పంపిణీ చేసి వివరించారు. రాష్ట్రాభి వృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌ కూటమి ప్రభుత్వమన్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.చిన్నబాబు, నేతలు బి.రమేష్‌, టి.హరనాథ్‌, పి.ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:56 PM