ప్రజా సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:07 AM
ప్రజా సంక్షేమమే ధ్యేయమని టీడీపీ నాయకులు తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు.గురువారం జిల్లావ్యాప్తం గా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి రెండేళ్లపాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయమని టీడీపీ నాయకులు తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు.గురువారం జిల్లావ్యాప్తం గా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి రెండేళ్లపాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు.
ఫ పాతపట్నం/రూరల్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు తెలిపారు. మండలంలోని మామిడిపల్లిలో రెండేళ్లనమ్మకం- సంక్షేమ విజయాలు, ప్రజాపాలన- ఇంటింటికీ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల బాబ్జీ, ఎస్.మధుబాబు, ఎ.మధు, మడ్డు రామారావు, డొల్లు శ్రీను, ఎన్. వెంకటరావు పాల్గొన్నారు.
ఫపలాసరూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లుకోలలో ఇం టింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌రావు, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణరావు, పీఏసీఎస్ చైర్మన్ వంకల కూర్మారావు, మండల కార్యదర్శి సంతోష్‌కుమార్, మురిపింటి కుమారరాజు, తమ్మినాన గంగారామ్ పాల్గొన్నారు. అలాగే బొడ్డపాడులో తెలుగు యువత అద్యక్షుడు కిక్కర ఢిల్లీరావు అధ్యక్షతన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరక్టర్ బొడ్డు దుష్యంత్, తామాడ ఽధర్మారావు, తామాడ సింహాద్రి పాల్గొన్నారు.
ఫనందిగాం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాంపురం, జల్లపల్లిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. రాంపురంలో టీడీపీ మండలాధ్యక్షులు పినకాన జోగారావు ఆధ్వర్యంలో, జల్లపల్లిలో వంశదార డీసీ చైర్మన్ మళ్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో రెండేళ్ల పాలనకు సంబంధించి కరపత్రాలను పంపిణీచేశారు.