Share News

ప్రజా సంక్షేమమే అజెండా

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:10 AM

ప్రజలు సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు

ప్రజా సంక్షేమమే అజెండా
సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి/ రూరల్‌/ సంతబొబ్మాళి/ కోటబొమ్మాళి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రజలు సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నర్సింగపల్లి గ్రామంలో సుమారు రూ.72లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించి మాట్లా డారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి పనులకు నిధులు కేటా యిస్తుందన్నారు. గత వైసీపీ హయాంలో అభివృద్ధి ని పూర్తిగా విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అ నంతరం డమర వద్ద నౌసడ- మెళియాపు ట్టి రోడ్డులో జి.జగన్నాథపురం వరకు చేపట్ట నున్న రహదారి పనులకు భూమి పూజ చేశారు. అలాగే సంతబొమ్మాళి మండలం నౌపడ మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద నౌపడ- మెళియాపుట్టి రోడ్డు నిర్మాణ పనులకు మం త్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సాయం త్రం శంకుస్థాపన చేశారు. నౌపడ-వెంకటాపురం, నౌపడ- పోలాకి వరకు రోడ్లను రూ.102 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. నౌపడలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అలాగే టెక్కలిలోని అంబేడ్కర్‌ జంక్షన్‌లో నౌపడా-మెళియాపుట్టి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాళి మండలం ని మ్మాడలో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అ చ్చెన్న ప్రజాదర్బార్‌ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చినవారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ట మూర్తి, టీడీపీ నాయకులు ఎల్‌ఎల్‌ నాయుడు, పి.అజయ్‌ కుమార్‌, హనుమంతు రామకృష్ట, పో లాకి షన్ముఖరావు, ఏఎంసీ వైస్‌ చైర్శన్‌ బాడాన రమణమ్మ, కర్రి విష్ణుమూర్తి, వాడరేవు కృష్ణారావు, కోట నారంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

టెక్కలిలో పర్యటిస్తూ..

టెక్కలి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయతీ టెక్కలి చిన్నబజారు జంక్షన్‌, కొడ్రవీధి, మేదరవీధి తదితర ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్య టించి సమస్యలపై వినతులు స్వీకరించారు. తక్షణమే ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల ను ఆదేశించారు. అనంతరం కొడ్రవీధి విస్తరణ పనులు పరిశీలించారు. చిన్నబజారు ప్రాంతంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. గీతామందిరాన్ని, మిస్సమ్మ బంగ్లా ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు పినకాన అజయ్‌ కుమార్‌, ఎల్‌ఎల్‌ నాయుడు, హనుమంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:10 AM