Share News

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: శంకర్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:48 PM

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: శంకర్‌
సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఆర్థిక ఇబ్బం దులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు మం జూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శనివారం అందజేశారు. విశాఖ-ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు రూ. 9,75,960 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పీఎంజేబాబు, ప్రధాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.

‘ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత’

గార, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శనివారం సాయంత్రం బూరవెల్లి గ్రామంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ వారి ఆధ్వర్యంలో గ్రామ సంకీర్తన నిర్వహించారు. ఇస్కాన్‌ సంస్థ భక్తి దాస, విజయ గోవింద ప్రభు ఆధ్వర్యంలో సంకీర్తన చేపట్టారు. ఎమ్మెల్యే స్థానిక లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధానా ర్చకుడు ఆరవెల్లి సీతారామస్వామి ఎమ్మెల్యేకి శేషవస్త్రం బహూకరిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి చర్య లు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు మల్ల అబ్బాయి నాయుడు, ఇస్కాన్‌ ప్రతినిధులు తిలారి శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:49 PM