ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించా
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:59 PM
నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం తనకు లభించిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
- 20 నెలల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు
- పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం తనకు లభించిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరు లతో మాట్లాడుతూ.. 20 నెలల కూటమి పాలనలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్న సంతృప్తి తనకు ఉందని తెలిపారు. ‘పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించా. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.నారాయణను కలిసి మురుగు కాలువల సమస్యను వివరించా. తాగునీటికి రూ.122 కోట్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. వంశధార కాలువ, మందస మండలంలో ఉన్న దామోదర్‌సాగర్, కళింగదళ్, డబారుసింగి రిజ ర్వాయర్ల ఆధునికీకరణ, ఆఫ్‌షోర్ రిజర్వాయరు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరాను. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బ్రాహ్మ ణతర్లా, కంబిరిగాం గ్రామాలకు ప్రధాన సమస్యగా ఉన్న వరహాల గెడ్డపై కాజ్‌వే నిర్మా ణానికి తొంద రలోనే మోక్షం కలగనుంది. ప్రతిపక్ష నాయకులకు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినా వారు ప్రజాసమ స్యలను ప్రస్తావించడంలో విఫలమయ్యారు.’ అని అన్నారు.