Share News

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:29 PM

ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారమే లక్ష్య మని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌
వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారమే లక్ష్య మని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్ర వారం ప్రజాదర్బార్‌ నిర్వహిం చారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విన తులు స్వీకరించారు. అనంతరం మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఉరిటి సాయి కుమార్‌, టీడీపీ పీఎంజే బాబు, కోరాడ హరగోపాల్‌, రెడ్డి గిరిజాశంకర్‌, పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:29 PM