Share News

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌: కలిశెట్టి

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:41 PM

ప్రజా సమస్యలు పరిష్కరించేం దుకే ప్రజా దర్బార్‌ చేప డుతుననట్లు విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌: కలిశెట్టి
ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న ఎంపీ కలిశెట్టి

రణస్థలం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కరించేం దుకే ప్రజా దర్బార్‌ చేప డుతుననట్లు విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. శుక్రవారం పైడి భీమవరంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్‌లో సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, చౌదరి బాబ్జీ, పిషిని జగన్నాఽథంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యుని సేవలో ఎంపీ కలిశెట్టి

అరసవల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలుకగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వ దించారు. ప్రసాదాలు, జ్ఞాపి కను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బీఎస్‌ చక్రవర్తి, అర్చకులు ఇప్పిలి షణ్ముఖ శర్మ, వికాస్‌ శర్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:41 PM