ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: ఎస్పీ
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:07 AM
ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యా దులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
శ్రీకాకుళం క్రైం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యా దులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేది కను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 56 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.