Share News

విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:44 PM

వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.

  విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన
విద్యార్థికి దుప్పటు అందజేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి :

జలుమూరు, (సారవకోట) జూలై 19 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం సారవకోట ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థులకు నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు, రగ్గులు, ఆట దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు పట్ట ఉమామహేశ్వరరావు, పి.రత్నాలునాయుడు, బైరి భాస్కరరావు, మూకళ్ల చిన్నయ్య, ఎస్‌.మురళీధర్‌, ఆదినారాయణ, తాడేల భీమారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:44 PM